వడమాలపేట మండలం ఎస్విపురం వద్ద గురువారం కురుస్తున్న భారీ వర్షాలకు జాతీయ రహదారి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద నీరు ప్రవహిస్తూ వాగుల వంటి పరిస్థితులను తలపిస్తోంది. పంట పొలాల నుంచి పోతున్న నీరు రహదారి పైకి చేరడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వర్షాలు కొనసాగితే పరిస్థితి మరింత పెరిగే అవకాశం ఉంది, దీంతో ప్రయాణికులు సర్వత్రా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.