పలమనేరు ఆర్డీవో భవాని ఆధ్వర్యంలో శనివారం పలమనేరు నియోజకవర్గ పరిధిలోని రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించారు. గత ఎన్నికలపై అభ్యంతరాలు తెలపాలని అధికారులు కోరడంతో అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని చోట్ల చాలా ఆలస్యంగా ఎన్నికలు జరగడంపై అభ్యంతరాలు తెలిపారు. వాటిని పరిశీలించిన ఆర్డీవో వారి అనుమానాలు నివృత్తి చేశారు. కార్యక్రమంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.