శివకుమార్ హత్య తర్వాత అతని పిల్లలు అనాథలయ్యారు. పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తూ పలమనేరు ఎమ్మార్వో ఇన్బానాదన్ కు వినతిపత్రాన్ని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులు గురువారం అందించారు. ప్రభుత్వం తరఫున గురుకుల పాఠశాలలో డిగ్రీ వరకు ఉచితంగా చదివించాలని, ఇద్దరు పిల్లల పేరు మీద ఇంటి స్థలం మంజూరు చేయాలని, ఉపాధి హామీ కోసం 5 ఎకరాల భూమిని ఇవ్వాలని డిమాండ్ చేశారు.