అక్రమంగా గోవులను తరలిస్తున్న కంటైనర్ ను హిందూ సంఘాల నాయకులు బుధవారం అడ్డగించారు. వివరాల్లోకి వెళితే పుంగనూరు మండలం భీమగానిపల్లి సర్కిల్ కమతంపల్లి రోడ్డు సమీపంలో చిత్తూరు వైపు వెళ్తున్న లారీలో గోవులను గుర్తించారు. దైవంగా భావించే గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు సత్వరమే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.