కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 200 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. 20 మంది కంటి ఆపరేషన్ చేయడానికి ఎంపికైనట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.