

చిత్తూరు: టోల్ గేట్ ద్వారా రూ. 2. 12 కోట్లు ఆదాయం
కాణిపాకం గ్రామం పంచాయతీ కార్యాలయంలో బుధవారం వాహనాల టోల్గేట్ వసూళ్లకు నిర్వహించిన సీల్డ్ టెండర్లలో రూ. 2కోట్ల 12 లక్షలు ఆదాయం లభించినట్లు పంచాయతీ కార్యదర్శి కుసుమకుమారి, సర్పంచ్ శాంతి సాగర రెడ్డి తెలిపారు. షీల్డ్ టెండర్లో అధిక మొత్తంలో వేసిన గుత్తేదారుడు సెల్వం దక్కించుకున్నారు. గుత్తేదారులు నిబంధనల మేరకు ఏడాది పాటు టోల్గేట్ వసూలు చేయాలని అధికారులు ఆదేశించారు.