ఆకట్టుకున్న దుర్యోధన వద కార్యక్రమం

61చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం వడ్డిపల్లి గ్రామ సమీపంలో భారతం మిట్ట వద్ద మహాభారత యజ్ఞంలో భాగంగా సోమవారం సాయంత్రం 6: 30 కు దుర్యోధన వద కార్యక్రమం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం చూడటానికి నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దుర్యోధన ఘట్టంలోని పద్యాలను భీమ, దుర్యోధన పాత్రధారులు వినసొంపుగా ఆలపించారు.

సంబంధిత పోస్ట్