చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంలో శనివారం నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షకు 588 మంది గాను 543 మంది విద్యార్థులు హాజరైనట్లు మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షకు 45 మంది ఆబ్సెంట్ అయినట్లు తెలియజేశారు. అదేవిధంగా ఈ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించిన పోలీస్ శాఖ, వైద్యశాఖ, పరిక్ష నిర్వాహకులకు మండల విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.