పుంగనూరు మండల పరిధిలో నల్లగుంట్ల పల్లి తండాలో భూ వివాదంలో స్టేషన్ కు వచ్చిన మురళి నాయక్ ను ఏఎస్ఐ మహేంద్ర కులం పేరుతో దూషించారని సోషల్ మీడియాలో దుమారం రేగింది. తనకు న్యాయం చేయాలని మురళి నాయక్ సోమవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నేలకు తల కొట్టుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఘటన స్థలానికి చేరుకున్న సీఐ శ్రీనివాసులు విచారించి న్యాయం చేస్తానని తెలిపాడు.