సదుం: అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ

75చూసినవారు
పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం రామాపురంలో నూతన అంబేద్కర్ విగ్రహాన్ని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడం ఎంతో ఆనందదాయకమని చెప్పారు. అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డప్ప, నాయకులు పెద్దిరెడ్డి, సుధీర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్