నాగలాపురం మండలంలో ఉన్న గొడ్డేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కల్వర్టు ఎత్తుగా నిర్మించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని సోమవారం స్థానికులు చెబుతున్నారు. రెండు రోజులుగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వర్షాలు తగ్గిన తర్వాత కల్వర్టు ఎత్తు పెంచే విషయంపై అధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచించాలని కోరుతున్నారు.