సత్యవేడు, నాగలాపురం, పిచ్చాటూరు పోలీస్ స్టేషన్లలో నమోదైన చోరీ కేసులకు సంబంధించి 5 ద్విచక్ర వాహనాలను బుధవారం స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని ఆంధ్ర సరిహద్దు మాదరపాకం మార్గంలో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాల విలువ 2లక్షల 88వేలు ఉంటుందని సత్యవేడు ఎస్ఐ రామస్వామి తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.