సత్యవేడు మండలం గొల్లపాలెం దళితవాడకు చెందిన రవి (44) మంగళవారం రాత్రి కరెంట్ షాక్‌కు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రవి శ్రీ సిటీ పరిధిలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఇంట్లో ఫ్యాన్‌కు మరమ్మతులు చేస్తుండగా కరెంట్ షాక్ తగిలింది. దీంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించేలోపు చనిపోయాడు. బుధవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.