సత్యవేడు మండలం రాజగోపాలపురంకు చెందిన స్టేట్ లీగల్ సెక్రటరీ టీడీపీ మాచర్ల రోశయ్య (ఆడిటర్) సోమవారం మృతి చెందారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కీలక నేతలు ఆయన మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని చెప్పారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు స్వగ్రామం రాజగోపాలపురంలో జరుగుతాయని తెలిపారు.