ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాళహస్తి డివిజన్ వ్యవసాయశాఖ అధికారి రమేశ్ రెడ్డి కోరారు. శనివారం వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ పంటలకు ప్రకృతి వైపరీత్యంతో నష్టం వాటిల్లినప్పుడు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. వేరుశనగకు ఎకరాకు రూ. 450, వరి పంటకు రూ. 630, మామిడి పంటలకు ఎకరాకి రూ. 1750 ఆన్లైన్ ద్వారా చెల్లించాలన్నారు.