శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుత కోటా భర్త కోటా చంద్రబాబుపై పెట్టిన కేసును చిత్తూరు జిల్లా కోర్టు కొట్టి వేసిందని వినుత కోటా ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి ప్రోద్భలంతో పోలీసులు 17 అక్రమ కేసులు పెట్టారన్నారు. అందులో ఒకటి తప్పుడు కేసుగా నిరూపణ అయ్యి కేసును కొట్టేయడం జరిగిందన్నారు.