సూళ్లూరుపేట నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణను జనవరి 18, 19, 20 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ తో కలిసి ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించే ప్రాంతాలలో మంగళవారం ఆమె పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.