బి. కొత్తకోట మండలం కాండ్లమడుగు క్రాస్ వద్ద గల పెట్రోల్ బంకులో వంద రూపాయలకే పెట్రోల్ పడతామని అంతకు తక్కువ లేదని నిర్వాహకులు హుకుం జారీ చేస్తున్నారు. మేము అడిగిన ధరకు పెట్రోల్ పట్టమని అడిగిన వారిని పెట్రోల్ బంక్ సిబ్బంది దబాయింపులతో బెదిరిస్తున్నారు. పెట్రోల్ బంక్ రాత్రి పది గంటలకే మూసేయడం , 100 రూపాయలకే పెట్రోల్ అమ్ముతాం అనే కండిషన్లతో ప్రజలు ఇదేం విడ్డూరం అని విస్తు పోతున్నారు.