పశ్చిమగోదావరిని తలపించేలా ముదివేడులో కోడి పందెం సాగింది. తంబళ్లపల్లి నియోజకవర్గంలోని కురబలకోట మండలం, ముదివేడు గొల్లపల్లి వద్ద ఆదివారం కోడి పందాలు కాయ్ రాజా కాయ్ అంటూ లక్షల రూపాయలు బెట్టింగులు వేసి, కోళ్లకు కత్తులు కట్టి యథేచ్ఛగా కోడి పందాలు నిర్వహించారని సమాచారం. వందలాది మంది ఒక్కచోటకు చేరి కోడి పందాలు ఆడడంతో.. ఎన్నడూలేనంతగా వందల మంది కోడి పందాలకు రావడంతో గొల్లపల్లి జాతరను తలపించిందని స్థానికులంటున్నారు.