మహిళపై దాడికి పాల్పడిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు శనివారం పెద్దమండెం ఎస్ఐ రమణ తెలిపారు. ముసలికుంట కు చెందిన మల్లమ్మ ఇంటి ముందు ఆముదాలు ఎండ పెట్టుకుని ఉండగా చిన్నప రెడ్డి తన ట్రాక్టర్ తో ఆముదాలు తొక్కించుకుని వెళ్లాడు. ఈ విషయమై చిన్నప రెడ్డిని నిలదీయగా ఆగ్రహించి అతని భార్య, పిల్లలు మల్లమ్మ పై దాడి చేసి గాయపరిచారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.