పెద్ద తిప్ప సముద్రం మండలం పట్టెంవాళ్ళపల్లె సచివాలయంలో శుక్రవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. నోడల్ అధికారి సుబ్రహ్మణ్యం, తహశీల్దార్ రామమూర్తి నాయక్ ఆధ్వర్యంలో నాయకులు ప్రజలనుండి భూ రెవిన్యూ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. పిజిఆర్ఎస్ నందు నమోదు చేసి వారికి రసీదులు అందజేశారు. సమస్యలను 45 రోజుల్లో పరిష్కరించేందుకు కృషి చేస్తామని తహశీల్దార్ తెలియజేశారు.