పెద్దమడ్ద్యం తహశీల్దార్ మహమ్మద్ సయ్యద్ శనివారం హౌసింగ్ లబ్ధిదారుల పొజిషన్ సర్టిఫికెట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వం మండలంలోని పేదలకు మంజూరు చేసిన పక్కా గృహాలకు పొజిషన్ సర్టిఫికెట్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. సర్టిఫికెట్లలో తేడాలు, లబ్ధిదారులకు బదులు మరొక నిర్మాణాలు చేపట్టడం వంటివి పెద్దమడ్ద్యంలోని కాలనీలో తనిఖీ చేయడం జరుగుతోందని తహశీల్దార్ చెప్పారు.