పెద్దమడ్ద్యం మండలం సి. గొల్లపల్లె బందెపురెడ్డి గారిపల్లెల్లో వేసవికాలంలో పశువులకు నీటి సమస్య లేకుండా, నీటితొట్టె నిర్మాణానికి శనివారం భూమి పూజ చేశారు. మండల నాయకులు సుమన్ మాట్లాడారు. పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని ఇందులో భాగంగా వేసవికాలంలో పశువులకు నీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ప్రతి గ్రామానికి రెండు పశువుల నీటి తొట్లు నిర్మించేందుకు ప్రభుత్వ ఆదేశం ఇచ్చిందన్నారు.