తిరుమలకు అధినేతల రాక మరింత కలవరాన్ని కలిగిస్తోంది. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఈ నెల 28న తిరుమలకు కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. అక్టోబర్ 1న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమలకు విచ్చేసి శ్రీవారి సమక్షంలో దీక్షను విరమించనున్నారు. 4వ తేదీ తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సతీ సమేతంగా తిరుమలకు రానున్నారు.