తిరుపతిలో దారుణ హత్య

64చూసినవారు
తిరుపతిలో దారుణ హత్య
తిరుపతి లోని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్‌లో మంగళవారం ఉదయం జరిగిన ఘర్షణలో ఒకరు హత్యకు గురయ్యారు. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. మహబూబ్ సాహేబ్ అనే వ్యాపారిపై రుద్ర అనే వ్యక్తి అప్పు విషయంలో దాడి చేశాడు. అజంతుల్లా అడ్డుకునే ప్రయత్నం చేయగా, రుద్ర కత్తితో దాడి చేసి అతన్ని హత్య చేశాడు. మహబూబ్ సాహేబ్‌కు కూడా గాయాలు అయ్యాయి. పోలీసులు రుద్రను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్