భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

58చూసినవారు
భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయానికి రానున్న కార్తీక మాసంలో విశేష సంఖ్యలో విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో జె. శ్యామలరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. టీటీడీ ఈవో బుధవారం సాయంత్రం శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయాన్ని సందర్శించారు. ఈవో ఆలయం ముందు ఉన్న శ్రీఆంజనేయ స్వామివారి ఆలయం, శ్రీకామాక్షి సమేత శ్రీకపిలేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్