తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం పై రమణ దీక్షితులు స్పందించారు. గురువారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేవుడి ప్రసాదాల్లో కల్తీ జరగడం విచారకరమన్నారు. లడ్డూల నాణ్యత సరిగా లేదని గతంలో అప్పటి టీటీడీ ఛైర్మన్, ఈవో దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ప్రసాదాల పరిమాణాలు సరిగా లేవని చెప్పా. నాది ఒంటరి పోరాటం కావడంతో ఫలితం రాలేదు. దీంతో ఐదేళ్లు మహాపాపం జరిగిపోయిందని చెప్పారు.