తిరుమల శ్రీవారి ఆలయంలో 25 రోజుల పాటు జరుగనున్న అధ్యయనోత్సవాలు సోమవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా రాత్రి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అధ్యయనోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11రోజులు ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.