టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రవణం విద్యార్థులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ సోమవారం సాయంత్రం శ్రవణం కేంద్రాన్ని, చిన్నారుల శిక్షణ తరగతులను అధికారులతో కలిసి పరిశీలించారు. టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతూ శ్రవణం కేంద్రంలోని విద్యార్థుల సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని, చిన్నారులకు ప్రధాన సౌకర్యాలను త్వరలో కల్పిస్తామన్నారు.