తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీవారి సారెను తిరుమల నుండి తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్దకు తీసుకువచ్చారు. శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు చేసి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవో వీరబ్రహ్మంకు అందజేశారు. పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను ప్రతి ఏటా తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది.