తిరుపతిలో టామి అనే పెంపుడు కుక్కను దారుణంగా హతమార్చిన సంఘటనను హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ అనిమల్స్ చైర్మన్ దివ్యారెడ్డి ఖండించారు. మంగళవారం తిరుపతిలో ఆమె మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తులు కావాలనే వాటిపై రాయి వేసి మొరిగిందని కోపంతో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో టామిని కత్తితో అతి దారుణంగా హత్య చేసి చంపారు. మూగజీవాల పైన దాడి చేస్తే చట్టపరంగా శిక్షించాలని కోరారు.