తిరుమల ఘాట్ రోడ్డులో యువకుల వికృత చేష్టలు

52చూసినవారు
తిరుమల ఘాట్ రోడ్డులో కొందరు యువకులు వారి వికృత చేష్టలతో హల్ చల్ చేశారు. ఆదివారం సాయంత్రం తిరుమల కొండ ఎక్కుతూ కారులో హడావుడి చేశారు. సన్ రూఫ్, కిటికీల నుంచి బయటకు నిలబడి సెల్ఫీలు తీసుకొంటూ గట్టిగా కేరింతలు కొడుతూ గందరగోళం సృష్టించారు. యువకుల చేష్టలు చూసి వాహనాల్లో వెళుతున్న యాత్రికులు విస్తుపోయారు. వారి ఆగడాలను ప్రయాణికులు కెమెరాలో బంధించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్