తిరుపతి జిల్లా వెంకటగిరి క్రాస్ రోడ్డులో శనివారం కాన్షీరామ్ 91వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి, కాన్షీరామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ జె. వెంకన్న, ఒంటెల. వెంకటేశ్వర్లు, నిజమాల. నరసింహులు, దాసరి మణి, నారి. సురేశ్, సత్యానందం, తదితరులు పాల్గొన్నారు.