వెంకటగిరి మండలం పారవోలు పంచాయతీ పరిధిలోని విశ్వనాథపురం ఎస్టీ కాలనీలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. మంగళవారం ఆయన ఇంటింటి వద్దకు వెళ్లి పింఛన్లు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ తంబిశెట్టి తనూజ రెడ్డి, మాజీ ఎంపీపీ తోట రామచంద్రయ్య, ఎంపీడీవో కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.