వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు కురుగొండ్ల శేఖర్ కన్నుమూశారు. డక్కిలి మండలం కమ్మవారిపల్లికి చెందిన శేఖర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ గుంటూరులో స్థిరపడ్డారు. ఈక్రమంలో గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వెంటనే గుంటూరుకు బయల్దేరారు.