సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ ట్రైలర్ విడుదల(వీడియో)
సుధీర్ బాబు హీరోగా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. మహేశ్‌బాబు ట్రైలర్ విడుదల చేసి టీమ్‌కు అభినందనలు తెలిపారు. ఈ సినిమాలో ఆర్ణ కథానాయికగా నటిస్తుండగా సాయాజీ షిండే కీలక పాత్రలో కనిపించనున్నారు.