నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన డిప్యూటీ సీఎం
TG: నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని తరహాలో ఉద్యోగాల భర్తీకి ప్రతి ఏటా వార్షిక క్యాలెండర్ విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఏ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామో ముందే తెలుపుతున్నట్లు వివరించారు.