AP: నరసరావుపేట ఎమెల్యే చదలవాడ అరవింద్ బాబుపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. విజయవాడ ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాలంటూ చదలవాడ గురువారం హల్ చల్ చేశారు. ఈ విషయంపై కమిషనర్ వచ్చి మాట్లాడినా ఎమ్మెల్యే వినిపించుకోలేదు. అయితే ఈ విషయం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. దీంతో వెంటనే వివరణ ఇవ్వాలని చదలవాడ అరవింద్‌బాబుకు ఆదేశాలు జారీ చేశారు. అరవింద్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర కార్యాలయాన్ని సీఎం ఆదేశించారు.