కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వరుస షాక్‌లు ఇస్తోంది. వరుసగా ధరలు పెంచుతూ నిత్యం ట్రెండింగ్‌లో ఉంటోంది. ఈ ఏడాది జనవరి 20న బీరు సుంకాలు పెంచారు. మరోసారి ధరలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తాజా నిర్ణయంతో ఎక్సైజ్ డ్యూటీ 185శాతం నుంచి 195 శాతానికి పెంచనున్నారు. బాటిల్ బీరు ధర ప్రీమియంలను బట్టి 10 నుంచి 45 రూపాయలు పెంచనున్నట్లు తెలుస్తోంది. రేట్లు పెంచితే బీరు అమ్మకాలు 10శాతం తగ్గవచ్చని విక్రేతలు భయపడుతున్నారు.