జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. ప్రతి నెలా ఒక రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలన్నారు. రాష్ట్ర ప్రగతి, మానవ వనరుల అభివృద్ధి కోసం పార్లమెంటులో చర్చించాలని ఎంపీలకు సూచించారు. ఎన్టీఏ, జనసేన పక్షాన మాట్లాడాలని, టెంపుల్ అభివృద్ధి, ఎకో టూరిజంపై దృష్టి సారించాలని తెలిపారు.