పారిశుద్ధ్య కార్మికులను సత్కరించిన ఎమ్మెల్యే

65చూసినవారు
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అనపర్తి మండలం రామవరంలోని పంచాయతీ కార్యాలయంలో గురువారం పారిశుద్ధ్య కార్మికులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారికి నిత్యవసర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగాభవాని కూటమి నాయకులు సురేష్ రెడ్డి, గోపాలకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్