నల్లజర్లలో వినాయక చవితి మండపాల పరిశీలన

59చూసినవారు
నల్లజర్లలో వినాయక చవితి మండపాల పరిశీలన
తూ. గో జిల్లా గోపాలపురం నియోజవర్గం నల్లజర్ల మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేస్తున్న వినాయక చవితి మండపాలను శుక్రవారం సీఐ శ్రీనివాస్, ఎస్సై శ్రీహరి బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీకి పలు సూచనలు చేశారు. వినాయక మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి ఉండాలని తెలిపారు. నియమ నిబంధనలకు లోబడి గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్