ఈ నెల 17వ తేదీన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం
ఈ నెల 17వ తేదీన జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా ద్వారా 19 ఏళ్ల లోపు పిల్లలు అందరూ ఆల్ బెండజోల్ మాత్రలు తప్పక వేసుకనేలా అన్ని శాఖల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా ముమ్మర పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లోని విధాన గౌతమి హాల్ లో ఈ నెల 17వ తేదీన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.