బీజేపీ తూ. గో జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు ఆధ్వర్యంలో రాజమండ్రిలోని బీజేపీ కార్యాలయం వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, యానాపు ఏసు తదితరులు పాల్గొన్నారు.