అల్లవరం మండలం దేవగుప్తం కాశీవారిపేటలో దేవగుప్తం సెంటర్ కు చెందిన బొర్రా వంశీ (22) కరెంట్ స్తంభంపై విద్యుత్ పనులు నిర్వహిస్తుండగా విద్యుత్ షాక్ కు గురయ్యాడు. ఒళ్లంతా తీవ్ర గాయాలు పాలైన వంశీని అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రాణాపాయం తప్పినా, అతని పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు శనివారం తెలిపారు. అల్లవరం పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు.