అంబేడ్కర్ కోనసీమ జిల్లా రెవెన్యూ క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలలో కలెక్టర్ మహేష్ కుమార్ బౌలింగ్ చేసి ఆకట్టుకున్నారు. అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియంలో మూడు రోజులు పాటు లీగ్ పోటీలు నిర్వహించారు. సోమవారం కలెక్టరేట్ అమలాపురం రెవెన్యూ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ లో కలెక్టర్ మొదటి ఓవర్ బౌలింగ్ చేశారు. కలెక్టరేట్ కెప్టెన్గా కలెక్టరేట్ ఉద్యోగి కిషోర్ వ్యవహరించగా ఇదే జట్టు గేలిచింది.