తమ డిమాండ్ల సాధన కోసం అమలాపురం మున్సిపాలిటీలో ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న అవుట్ డోర్, ఇండోర్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె బుధవారం 10వ రోజుకు చేరింది. ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ల యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏపీ కమిషనర్, మున్సిపల్ సంచాలకులు వడ్డేశ్వరంతో జరిపిన చర్చలలో సమ్మెను రెండు నెలలు వాయిదా వేసినట్లు మున్సిపల్ కమిషనర్ రాజుకు ఉద్యోగులు వినతిపత్రం అందించారు.