అమలాపురం: ఆక్వా రంగం సమస్యలపై రైతుల ఆందోళన

66చూసినవారు
అక్రమ విద్యుత్ వసూళ్లను వెంటనే నిలిపివేయాలని, నాణ్యమైన విద్యుత్తును అందించాలని రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ సత్తిబాబు రాజు డిమాండ్ చేశారు. సోమవారం అమలాపురంలో ఆక్వా రైతులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆక్వా ఎగుమతి దారుల నియంతృత్వ ధోరణి నశించాలన్నారు. రొయ్యలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రొయ్యల మేత ధరలు తగ్గించాలన్నారు. విద్యుత్తు లో వోల్టేజ్ సమస్య పరిష్కరించాలన్నారు.

సంబంధిత పోస్ట్