అమలాపురం: ఎర్ర వంతెన వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

83చూసినవారు
అమలాపురం ఎర్ర వంతెన వద్ద శనివారం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. శనివారం అమలాపురం స్థానిక ఎంపీ హరీష్ మాధుర్ కార్యాలయం వద్ద హరీష్ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్న సందర్భంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఏడు నియోజకవర్గాల నుంచి నాయకులు తరలి రావడంతో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. దీనితో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్