ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బెయిల్ పిటిషన్ పై క్రాస్ అప్పీల్ వేయాలని విస్తృత దళిత సంఘం నేత డాక్టర్ బూసి వెంకట్రావ్ డిమాండ్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో గురువారం అమలాపురం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అట్రాసిటీ కేసులో నిందితులను కాపాడే అధికారులపై సెక్షన్ 4 ప్రకారం చర్యలు తీసుకోవాలని విదసం నేతలు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.